పళ్లు తోమితే గుండె జబ్బు ముప్పు తగ్గుతుంది !

teeth 300x187 పళ్లు తోమితే గుండె జబ్బు ముప్పు తగ్గుతుంది !అవును మీరు చదివింది నిజమే. చిగుళ్ల సంరక్షణకు పళ్లు తోముకోవడం, ఫ్లాసింగ్‌ చేసుకోవడంతోపాటు క్రమం తప్పకుండా దంత వైద్యులను సంప్రదించడం వల్ల గుండె జబ్బుకు దూరంగా ఉండొచ్చని కొత్త అధ్యయనం వెల్లడించింది. ఈ అంశంపై కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన మిల్‌మన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అధ్యయనం చేసింది. చిగుళ్ల ఆరోగ్యం మెరువడం వల్ల అథిరొస్ల్కిరోసిస్‌ వృద్ధిచెందడం నెమ్మదించిందని తొలిసారిగా అధ్యయనం నిరూపించింది. అథిరోస్ల్కిరోసిస్‌ అంటే ధమనులు కుదించుకుపోవడం. గుండె జబ్బు, పక్షవాతం, మరణానికి ప్రధాన కారణం ఇదే. ఓరల్‌ ఇన్‌ఫెక్షన్లు, వాస్య్కులర్‌ డిసీజ్‌ ఎపిడెమియోలజి స్టడీలో భాగంగా 420 మందిపై పరిశోధకులు అధ్యయనం చేశారు. వీరి నుంచి యాదృశ్ఛికంగా నమూనాలను సేకరించారు. పళ్లకు సంబంధించిన జబ్బులేమైనా ఉన్నాయోమోనని వీరిని పరీక్షించారు. పళ్లు, చిగుళ్ల కింది నుంచి 5008 పంటిగార నమూనాలను సేకరించి విశ్లేషించారు. సగటున వీరిని మూడేళ్లపాటు అనుసరించారు. పళ్ల ఆరోగ్యం మెరుగవడం వల్ల గుండె జబ్బు వచ్చే ముప్పు నెమ్మదించింది. అధ్యయనం జర్నల్‌ ఆఫ్‌ హార్ట్‌ అసోసియేషన్‌ అమెరికాలో ప్రచురితమైంది. గుండెజబ్బును నివారించడానికి మనం కూడా ఈ రోజు నుంచి పళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>